Nani | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఏ చెత్తయినా మాట్లాడి తప్పించుకోవచ్చని భావించే రాజకీయనాయకులను చూస్తే అసహ్యం వేస్తున్నదని సినీ నటుడు నాని పేర్కొన్నారు. సమంత, నాగచైతన్య విడాకుల అంశం మీద మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడేవారు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారని ఆశించడం తమ తెలివితక్కువతనమే అవుతుందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఎటువంటి ఆధారం లేకుండా మీడియా ముందు చెత్త మాట్లాడితే చెల్లుతుందనుకోవడం చెల్లదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సమాజంపై దుష్ప్రభావం చూపే ఇటువంటి ప్రయత్నాలను ఖండించాలని కోరారు.