హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని చందానగర్ సరిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు.
శేరిలింగంపల్లి మండలం మదీనగూడలోని ఈర్ల చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులివ్వడం, వాటిని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల మేరకు విధులు నిర్వహించానని, తనపై నమోదు చేసిన కేసు చట్ట వ్యతిరేకమని, అందులోని అభియోగాలు నిరాధారమని, వాటిని కొట్టివేయాలని సుధాంశ్ కోరారు.