హైదరాబాద్ : నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో (Nampally fire accident) చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా (Ex-gratia) ను ప్రకటించింది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivas Reddy) అన్నారు.
ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీహరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.