హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులకు ప్రాచుర్యం కల్పించేందుకు ఇంటర్ విద్య అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఇందులోభాగంగా హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ సొసైటీ.. నుమాయిష్‌లో ‘వృత్తి విద్యలు ఉపాధి అవకాశాలు’ పేరిట స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ స్టాల్‌ను మంగళవారం ఇంటర్ విద్య డైరెక్టర్ శృతి ఓజా, ఆర్జేడీ జయప్రదాబాయి ప్రారంభించారు. రాష్ట్రంలో 185 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వీటిల్లో 22 రకాల వృత్తివిద్యాకోర్సులను, మరో 53 స్పల్పకాలిక వృత్తివిద్యాకోర్సులను (షార్ట్‌టర్మ్) నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సులు, ఉపాధి సమాచారాన్ని ఈ స్టాల్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.