నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఐబొమ్మ రవిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లపై నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నేడు తీర్పు వెలువరించనున్నది. గురువారం కోర్టులో వాదనలు ముగిశాయి. రవిపై 5 కేసులు నమోదు కాగా నాలుగు కేసుల్లో వేర్వేరుగా కస్టడీకి అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీలత కోర్టును కోరారు.
తండేల్, కుబేర, కిష్కింధపురి పైరసీపై నాలుగు కేసులు నమోదయ్యాయని, వీటిలో లోతుగా విచారించాల్సి ఉన్నదని తెలిపారు. నాలుగు కేసుల్లో పోలీసు కస్టడీకి అప్పగించడం అప్రస్తుతమన్నారు. కస్టడీ ముగిసి, వాదనలు వినిపించాల్సిన సమయంలోనే పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారని, వెంటనే కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్లు వేశారని తెలిపారు. బెయిల్‌ను అడ్డుకునేందుకే పోలీసులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై కూడా నేడు విచారించనున్నది.