నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును నాంపల్లిలోని ప్రజాప్రతిధుల కోర్టు బుధవారం విచారించనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రూపుమాపేందుకు బీజీపీ కంకణం కట్టుకున్నదని మే 4న కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ఆరోపించడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు.
బీజేపీ ప్రతిష్ఠకు కలిగేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగూడెం సభలో రేవంత్ ప్రసంగానికి సంబంధించిన క్లిప్లింగ్‌లను కోర్టుకు సమర్పించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. దీనిపై విచారణకు సీఎం రేవంత్ లేదా ఆయన తరఫు న్యాయవాది హాజరు కావాలని గత నెల 25న కోర్టు ఆదేశించింది.