హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్నారని తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి తెలిపారు. కౌన్సిల్‌కు ఆరుగురు ఫార్మాసిస్టులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినవారే ఎన్నికలకు అర్హులని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మాసిస్టులు వెంటనే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31లోగా రిజిస్టర్ అయినవారికే ఓటుహక్కు ఉంటుందని స్పష్టం చేశారు.