ఖలీల్‌వాడి (నిజామాబాద్), మార్చి 8: కష్టకాలంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. రియల్టర్లు, బిల్డ ర్లు, కొనుగోలుదారులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తో కలిసి శనివారం ప్రారంభించారు. షోలో కొలువుదీరిన 22 స్టాల్స్‌ను పరిశీలించి, ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వేముల మాట్లాడుతూ.. ప్రాపర్టీ షోను జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. నచ్చిన ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం ఇక్కడ ఉందని తెలిపారు.
నిజామాబాద్‌తో పా టు హైదరాబాద్‌కు చెందిన సంస్థలు పాల్గొన డం అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా అన్నారు. మహిళా దినోత్సవం రోజున నిర్వహిస్తున్న ఈ షో ద్వారా భర్తలు భార్యలకు అద్భుమైన గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, మాజీ మేయర్ నీతూకిరణ్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నేత సత్యప్రకాశ్, శంకర్, నమస్తే తెలంగాణ బీఎం ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్, కరీంనగర్లో ప్రాపర్టీషో, వరంగల్‌లో ఆటోషో శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్నాం. అన్ని పర్మిషన్స్ఉన్న ప్రాపర్టీస్‌నే అనుమతించాం. ఒకే వేదికపై ప్లాట్స్, విల్లాస్, ఫ్లాట్స్, సోలార్, సిమెంట్ ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో నిర్ణయాలు తీసుకోవడం సులువుగా ఉంటుంది. అన్ని రకాల వాహనాలు ఒకే గొడుగు కిందకు రావడంతో వాహనం స్టయిల్, మైలేజ్, ధర చూసుకోవచ్చు. బ్యాంకులు రుణసదుపాయానికి సిద్ధంగా ఉన్నాయి.
– ఎన్ సురేందర్‌రావు, జనరల్ మేనేజర్(ప్రకటనలు) నమస్తేతెలంగాణ,తెలంగాణ టుడే