భీమదేవరపల్లి, జూలై 18 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ‘ముల్కనూరు సాహితీ పీఠం- నమస్తే తెలంగాణ దినపత్రిక’ సంయుక్తంగా ఏటా జాతీయస్థాయి కథల పోటీలను నిర్వహిస్తున్నది. ఈ యేడు కూడా కథల పోటీలు నిర్వహించగా, ఇప్పటికే విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. నేడు ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో ‘కథోత్సవం-2026’ పేరిట విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్, ఆత్మీయ అతిథులుగా కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ హాజరుకానున్నట్టు నిర్వాహకులు, సీఎంవోఎస్డీ వేముల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ వంగ రవి తెలిపారు.