నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకర కపర్ది శర్మతో గౌరీభట్ల శారదాప్రసాద్, విరజ దంపతుల కూతురు మనస్విని వివాహ మహోత్సవం ఆదివారం సిద్దిపేటలో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సురభి వాణీదేవి, కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, బక్కి వెంకటయ్య, శంభీపూర్ రాజు, బాల్క సుమన్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.