హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ చిలువేరు మృత్యుంజయ్‌కి మరోసారి జాతీయ స్థాయి బహుమతి లభించింది. రోడ్డుభద్రతపై ‘కార్టూన్ వాచ్’ సంస్థ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రవాణాశాఖ, రాయ్‌పూర్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సంయుక్తంగా జాతీయ స్థాయి కార్టూన్ పోటీలు నిర్వహించాయి. ‘రోడ్డుభద్రత-హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం’ అనే అంశంపై జరిగిన పోటీలో దేశవ్యాప్తంగా ఔత్సాహిక కార్టూనిస్ట్‌లు పాల్గొని సృజనాత్మక కార్టూన్లు వేశారు.
ఇందులో మృత్యుంజయ్ మొదటి బహుమతి గెల్చుకున్నారు. హెల్మెట్ అంటే ప్రాణాలు కాపాడే సంజీవని అని చాటిచెప్పేలా మృత్యుంజయ్ కార్టూన్ గీశారు. హెల్మెట్ ప్రాధాన్యతను అద్భుతంగా ఆవిష్కరించిన మృత్యుంజయ్ కార్టూన్‌ను న్యాయనిర్ణేతలు మొదటి బహుమతికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మృత్యుంజయ్‌ని పలువురు పాత్రికేయులు, కార్టూనిస్ట్‌లు అభినందనలు తెలిపారు.