నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద చాపర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. 133 కేవీ విద్యుత్ తీగలను చాపర్ తగలడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింగిల్ సీటర్ చాపర్ ప్రమాదానకి గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చాపర్‌లో తమిళనాడుకు చెందిన మహిమ అనే పైలట్ ఒక్కరే ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరికాసేపట్లో ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే చాపర్ కూలిన ప్రాంతంలోనే 133 కేవీ విద్యుత్ లైన్ ఉంది. చాపర్ కూలిన వెంటనే స్థానిక రైతులు, కూలీలు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన చాపర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు.