యాదగిరిగుట్ట/సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 16 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా సమర్పించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏఈవో రఘు, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులకు బంగారు చీరను అందజేశారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారంరోజుల పాటు శ్రమించి 2 గ్రాముల బంగారం వినియోగించి, 5.30 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పులో ఉన్న ఈ చీరను అగ్గిపెట్టెలో ఇమిడేలా రూపొందించినట్టు విజయ్ తెలిపారు. చేనేత కళాకారుడు విజయ్ తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో తయారు చేసిన వస్ర్తాన్ని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందజేశారు.