
రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ, యూజీడీపీఈడీ రెండేండ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వ హించే టీఎస్‌పీఈసెట్-2021కి భలే క్రేజీ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 కళాశాలల్లో 1390 సీట్లు అందుబాటులో ఉండ గా ఆగస్టు 30తో ఎలాటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు గడవు ముగియడంతో ఆ సెట్‌కు 4,817 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎలా ఉందో ఇట్టే తెలుస్తుంది.
ఇదిలాఉంటే యూజీ డీపీఈడీకి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కళాశాలల్లో (ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల దోమల గూడలో200, వేదా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిద్ధిపేటలో 50, శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హలియాలో 50, ఎంఎస్ఆర్ సూర్యాపేటలో 50) 350 సీట్లు మాత్రమే ఉన్నాయి. దరఖాస్తులు 2097 రావడంతో పోటీ చూస్తే 1:10 శాతంగా ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 4వరకు గడువు ఉండగా ఇంకా కొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న ట్లు సెట్ కన్వీనర్, ఎంజీయూ డిపార్టుమెంట్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొ. సత్యనారాయణ నమస్తే తెలంగాణకు తెలి పారు. సెట్ నిర్వహణను ఉన్నత విద్యామండలి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించడంతో సెట్ చైర్మన్ ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో కన్వీనర్ ప్రొ. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహణ సాగనుండటం మనకు గమనార్హంగా చెప్పవచ్చు.