యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం మునుగోడు ప్రజల నోట్లో మట్టికొట్టింది. ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తీసుకున్నది. ప్ర పంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడుకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంజూరైన ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్‌ను గద్దలా తన్నుకుపోయింది. రాజకీయం కోసం ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌కు తీసుకుపోయింది. దీంతో ఇక్కడి ఫ్లోరోసిస్ బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయాలు, ఆపరేషన్లు, ఉపాధి దక్కకుండా పోయాయి.
ఫ్లోరైడ్ అండ్ ఫోరోసిస్ మిటిగేషన్ సెంటర్ కోసం కేటాయించిన స్థలం
జిల్లాలో 6.5 లక్షల మంది బాధితులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 6.5 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. వారిలో 75 వేల మంది కనీసం నడవలేని దుస్థితిలో కాలం గడుపుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, పాపంతో ఘోరమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ బాధలు చూడలేక అనేక సంఘాలు ఏండ్లపాటు ఆందోళనలు చేశాయి. గతంలో సీఎం కేసీఆర్‌ను కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు మునుగోడుకు తీసుకొచ్చారు. ఫ్లోరైడ్ పోరు యాత్ర చేపట్టారు. నేషనల్ న్యూట్రిషన్ సంస్థ, ఇతర శాస్త్రవేత్తలు పరిశోధనలు, ప్రతిపాదనల తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్‌ను అప్పటి కేంద్రమంత్రి జైరాం రమేశ్ మంజూరు చేశారు. ఇందుకోసం దండు మల్కాపురంలో 8 ఎకరాల భూమిని కలెక్టర్ కేటాయించారు. వెంటనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతే ఈ సెంటర్ పనులు అటకెక్కాయి. ఏమీ చేయకపోగా మంజూరైన కేంద్రాన్ని బీజేపీ కుటిల రాజకీయాల కోసం బెంగాల్‌కు ఈ సెంటర్‌ను తరలించింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ, స్థానిక కాషాయ నేతలు మాత్రం నోరుమెదపలేదు.
ఎంతో మేలు జరిగేది..
ఈ కేంద్రం కనుక ఇక్కడే ఉంటే ఫ్లోరోసిస్ బాధితులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేది. 150 పడకల దవాఖాన ఏర్పాటయ్యేది. ముఖ్యంగా ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందేది. వంకరపోయిన కాళ్లను సరిచేసే అవకాశం దక్కేది. మొబైల్ బస్సు ద్వారా బోర్లు వేసిన సమయంలో ఫ్లోరైడ్ పర్సెంటేజీ నిర్ధారించే వీలు కలిగేది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి.
మా గోడు కన్పిస్తలేదా?
ఫ్లోరైడ్ రక్కసితో మేమంతా ఏండ్ల తర బడి పడరాని బాధలు పడుతున్నం. కనీ సం నడవలేని పరిస్థితి. ఈ నీళ్లను తాగ లేం. వంట చేసుకోలేం. పంటలు పండిచు కోలేం. ఇంత కష్టపడుతున్నా బీజేపీకి మా గోడు కనిపిస్తలేదు. బీజేపీకి ఫ్లోరోసిస్ బా ధితుల ఉసురు తగుల్తది. ఇట్లాంటి పార్టీని ఎట్ల గెలిపిస్తరు? చిత్తుగా ఓడించాలి.
– తిరుపతమ్మ, వట్టిపల్లి, మర్రిగూడ