శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Aug 04, 2020 , 08:16:42

నాగార్జున సాగర్‌ @ 215టీఎంసీలు

నాగార్జున సాగర్‌ @ 215టీఎంసీలు

నల్గొండ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ ఫ్లో 38,140 క్యూసెక్కులు వస్తుండగా, 2200 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 552.60 అడుగులు కాగా, ప్రస్తుతం 552.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో 215.54 టీఎంసీల నీరుంది. కాగా, ఈ ఏడాది కృష్ణానది ముందుగానే జలకళను సంతరించుకున్నది. ఎగువన ఆల్మట్టి, నారాయణపురం నిండడంతో జూరాల మీదుగా జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అక్కడి నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు చేరుకుంటున్నది. గతేడాదితో పోలిస్తే శ్రీశైలానికి రెండు వారాల ముందుగానే కృష్ణానదికి వరద ప్రవాహం మొదలుకావడంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.