టెస్టుల్లో మనమే బెస్ట్.. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు ‘ఎన్ఏబీఎల్’ సర్టిఫికెట్
రోగులకు రూపాయి కూడా భారం పడకుండా అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా దవాఖానల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంతో ఆర్థిక ఊరటనిస్తున్నాయి.
- వైద్య పరీక్షలకు జాతీయస్థాయిలో కితాబు
- పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో నాణ్యతకు గుర్తింపు
- ప్రైవేటు ల్యాబ్‌లతో పోటీగా అత్యుత్తమ సేవలు
- ఇప్పటివరకు రూ.340 కోట్లకుపైగా లబ్ధి
- సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రోగులకు రూపాయి కూడా భారం పడకుండా అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా దవాఖానల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంతో ఆర్థిక ఊరటనిస్తున్నాయి. ప్రైవేటు కేంద్రాల్లో వేలు ఖర్చయ్యే పరీక్షలన్నీ ఇక్కడి తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో ఉచితంగా చేస్తుండటంతోపాటు ఫలితాలను శరవేగంగా అందజేస్తున్నారు. నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు కేంద్రం ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబొరేటరీస్’ (ఎన్ఏబీఎల్) సర్టిఫికేషన్ ఇచ్చింది. నిరుపేద రోగులకు కార్పొరేట్‌స్థాయి వైద్యమందించడంతోపాటు టెస్టులన్నీ ఉచితంగా చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇందులో భాగంగా 2017లో తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించారు.
పీహెచ్సీ మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌లో రక్త,మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఈసీజీ, యూసీజీ వంటి మొత్తం 57 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. గర్భిణుల కోసం ‘టిఫా’ స్కానింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. గుండె సమస్యలను గుర్తించే క్యాథ్‌ల్యాబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 5 ఏండ్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 36 లక్షల మందికిపైగా ప్రయోజనం పొందారు. వీరి నుంచి 69 లక్షల శాంపిళ్లు సేకరించి, 6.5 కోట్ల పరీక్షలు జరిపారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో ఈ పరీక్షల విలువ సుమారు రూ.340 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
వైద్య సిబ్బందికి అభినందనలు
పేదలకు ఉచితంగా వైద్యంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ప్రారంభమైంది. దీంతో పేదలకు ఆర్థికభారం తప్పుతున్నది. ఈ సేవలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం హర్షనీయం. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు. రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
– మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ డయాగ్నస్టిక్స్‌లో చేసిన పరీక్షలు (28 అక్టోబర్ 2022 వరకు)
మొత్తం రోగులు – 36,20,789
సేకరించిన శాంపిళ్లు – 68,96,568
చేసిన టెస్టులు – 6,46,59,219
విలువ (అంచనా) – రూ.340 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

