హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ( Konda Susmitha ) సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతుండగా శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకు పడ్డారు.
తాను కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ని విమర్శించలేదుని, రేవంత్ రెడ్డిని లక్ష్యంగా విమర్శించానని సమర్దించుకున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, వేణుగోపాల్, మీనాక్షి మేడం అంటే గౌరవం ఉందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే అతన్ని టార్గెట్ చేశానని పేర్కొన్నారు.
పరకాలలో పర్యటించిన సీఎం రేవంత్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తానని ప్రకటించారని , అతనికి ఏం అధికారం ఉందని ప్రశ్నించా రు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను కాంగ్రెస్ అధిష్టానం, సీడబ్ల్యూసీ ప్రకటిస్తుందని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.