ఖైరతాబాద్, జూన్ 3 : ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు కలిసి తన ఆస్తులను కబ్జా చేశారని ఆ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ సభ్యుడు రావి మురళీమోహన్ ఆరోపించారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలోని చిలకలూరిపేటలో తనకు ‘సాయికార్తీక్ సిటీ సెంటర్’ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నదని, అందులో రెండు థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, రెండు అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.69 కోట్ల వరకు ఉంటుందని వివరించారు.
తాను 20 ఏండ్లుగా అమెరికాలో ఉండటంతో పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.