హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): జాతీయ సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లను డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్ఐఆర్, సీసీటీఎన్ఎస్ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదురోవాలంటే పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రతా ప్రమాణాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయస్థాయిలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించేలా కృషి చేయాలని సూచించారు.