తెలంగాణలో ఊహించని అభివృద్ధి
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇక్కడి వచ్చి ఉండాలని అనిపిస్తున్నదని టాం జానియాలోని షిన్యాంగా మున్సిపల్ కౌన్సిల్ మాజీ మేయర్ గులాం హఫీజ్ అబూబకర్ ముకాదమ్ పేర్కొన్నారు. మంగళవారం హోం మంత్రి మహమూద్అలీతో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా మన కండ్లముందే ఊహించని అభివృద్ధి జరిగిందని చెప్పారు.
- ఇక్కడికి వచ్చేయాలని అనిపిస్తున్నది
- ఇలాంటి సర్కారును గెలిపించుకోవాలి
- టాంజానియా మాజీ మేయర్ గులాం హఫీజ్
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇక్కడి వచ్చి ఉండాలని అనిపిస్తున్నదని టాం జానియాలోని షిన్యాంగా మున్సిపల్ కౌన్సిల్ మాజీ మేయర్ గులాం హఫీజ్ అబూబకర్ ముకాదమ్ పేర్కొన్నారు. మంగళవారం హోం మంత్రి మహమూద్అలీతో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా మన కండ్లముందే ఊహించని అభివృద్ధి జరిగిందని చెప్పారు. 2011లో తెలంగాణకు ఒకసారి వచ్చానని, ఇప్పుడు 2023లో మళ్లీ వచ్చానని పేర్కొన్నారు. నాటికి నేటికి ఇంతటి అభివృద్ధిని కలలో కూడా తాను ఊహించలేదని చెప్పారు. టాంజానియాను వదిలి తెలంగాణను రావాలనిపిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉం దని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే ముస్లింల అభివృద్ధి: హోంమంత్రి
దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని హోంమంత్రి మహమూద్‌అలీ స్పష్టం చేశారు. మైనార్టీల రక్షణ కోసం దేవుడు పంపిన ఫరిష్తా (దైవదూత) సీఎం కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజాంఅలీ, బద్రూద్దీన్, అర్షద్ అలీఖాన్, మునీభాయ్, మసివుల్లాఖాన్, మఖీత్ చందా, షాహీద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

