జడ్చర్ల టౌన్/మక్తల్/రామవరం/ ఖమ్మం/ భద్రాచలం/ కూసుమంచి, ఏప్రిల్ 18: వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాల నాయకులు, మతపెద్దలు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భద్రాద్రి జిల్లా రామవరంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కూసుమంచిలో మానవహారం చేపట్టారు. ఖమ్మంలో ‘రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, వక్ఫ్‌చట్టాన్ని తిరస్కరిద్దామని నినాదాలు చేశారు. సవరించిన వక్ఫ్‌చట్టాన్ని రద్దుచేయాలంటూ భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మైనార్టీ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతోపాటు జాతీయ, నల్లజెండాలను చేతబూనారు.