హైదరాబాద్, మే 25 (నమస్తేతెలంగాణ): తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. వారి పిల్లలతోపాటు నాటిన ఆ మొక్కలు కూడా పెరిగి వృక్షాలుగా మారుతాయని చెప్పారు. ఆ వృక్షాలు భవిష్యత్తు తరాలకు మేలు చేస్తాయని వివరించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా హరితసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ పార్క్‌లో పట్నాయక్ మొకలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా సంతోష్‌కుమార్ ఎనిమిదేండ్లుగా విరివిగా మొక్కలు నాటిస్తూ, పర్యావరణానికి దోహదపడుతున్నారని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారని, సంతోష్‌కుమార్ చేపట్టిన ఈ ఉద్యమానికి తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సేవన్ హీల్స్ సతీశ్, సింగర్ సత్యయామిని, నా బెస్ట్ ఫ్రెండ్ రా ందన్ను మొకలు నాటలని ఆర్పీ పట్నాయక్ నామినేట్ చేస్తూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హరితసేన కో-ఆర్డినేటర్ భోజనారాయణ తదితరు పాల్గొన్నారు.