పల్లవి:
కాళేశ్వరం జలధార పల్లె పల్లె పారెను..
అన్నదాత రైతుబతుకు వెలుగుబాటలేసెను ॥కోరస్
అక్కలారా రైతులారా అందరు కదలండి ॥కోరస్
అరవై ఏండ్ల గోసనాప అభివృద్ధికి వేసేబాట ॥కాళేశ్వరం॥
చరణం:
చెరువులు కుంటలల్లో దండిగ నీరెండెను..
బీడు భూములన్ని పంట చేనులాయెను ॥కోరస్
పచ్చని పొలాలతో పల్లెసిరులు కురిసెను ॥కోరస్
పక్షుల కిలకిలలతో పల్లెతల్లి మురిసెనో ॥కాళేశ్వరం॥
చరణం:
ప్రతి పల్లెకు ప్రతి జీవికి చెరువే ఆధారము..
చెరువల చింత తీర్చ చేయి చేయి కలిపెనో ॥కోరస్
పచ్చని పల్లెకు ప్రతి రైతు రాజుఐతే ॥కోరస్
ప్రతి ఇంటి సుఖశాంతుల సంబరాల పండుగే ॥కాళేశ్వరం॥
చరణం:
కాకతీయ రాజువలె కేసీయారు కదిలెనో..
కాళేశ్వర జలధారతో తెలంగాణ మెరిసెను ॥కోరస్
కవులు, కళాకారులు ఉద్యోగులు సారథులు ॥కోరస్
బంగారు తెలంగాణకై బాటలెన్నో వేసెనూ.. ॥కాళేశ్వరం॥
-పమ్మి రవి 93968 11884