హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో మున్నూరుకాపు ప్రముఖు లు పలువురు.. మంత్రులు కేటీఆర్, జగ దీశ్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లోని కేటీఆర్ క్యాం పు కార్యాలయంలో కలిసి మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం చేకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ భేటీలో జీహెచ్ఎం సీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, పుట్టం పురుషోత్తం, ఆకుల రజిత్ ఉన్నారు.