జవహర్‌నగర్, మే 17: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన సీడీఎంఏ దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు సరైన విధంగా పదోన్నతులు కల్పించడంలేదని, ఒకే క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతుల్లో వ్యత్యాసం ఉన్నదని పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీపీఎస్ ఖాతాను తెరవాలని, రోస్టర్ పాయింట్లలో పదోన్నతులు కల్పించాలని, ఆర్జిత సెలవులు, రవాణా చార్జీలు చెల్లించాలని వినతిపత్రంలో కోరారు. సీడీఎంఏ దివ్య స్పందిస్తూ మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌యాదవ్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. సీడీఎంఏను కలిసిన వారిలో ఆర్డీఎం శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు వెంకటగోపాల్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ ఉన్నారు.