హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల అమెరికాలో నిర్వహించే కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి వెళ్తున్న మహేశ్వరం మాడల్ స్కూల్ విద్యార్థులను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అన్ని విధాల సహకారం అందిస్తానని మంత్రి హామీనిచ్చారు. కార్తీక్‌రెడ్డి వెంట స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్, గైడ్ బాబు ఉన్నారు.