ములుగు, ఏప్రిల్ 8 (నమస్తేతెలంగాణ): రోడ్డు ప్రమాదానికి గురైన తన బంధువును ములుగు ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం తీసుకురాగా సమయానికి వైద్యులు లేకపోవడంతో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌కు ఫోన్ చేసినట్టు యువజన కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ తెలిపారు. 16 సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో భావోద్వేగానికి లోనై ఫోన్లో తిట్టిన మాట వాస్తవమేనని సో షల్ మీడియా ద్వారా అంగీకరించారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
రవిచంద్రను శిక్షించాలి: వైద్య సంఘాలు
డాక్టర్ జగదీశ్వర్‌ను ఫోన్లో దుర్భాషలాడిన బానోతు రవిచందర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైద్య సం ఘాలు డిమాండ్ చేశాయి. ఘటనను ఖండిస్తూ టీవీవీపీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం సోమవారం ప్రకటన విడుదల చేసింది. సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తిని బెదిరించటం అమానుష చర్యగా పేర్కొన్నది. రవిచందర్ బేషరతుగా, రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.
వైద్యం చేసినా.. బూతులు తిట్టారు
ములుగు సూపరింటెండెంట్ జగదీశ్వర్ సోమవారం టీవీవీపీ కమిషనర్‌కు రాసిన లేఖలోనూ రవిచందర్ తనను దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 8.20 గంటలకు రవీందర్ అనే వ్యక్తి తలకు గాయాలై తమ దవాఖానకు రావడంతో డ్యూటీ డాక్టర్ వెం టనే స్పందించి ప్రాథమిక చికిత్స అం దించారన్నారు. అతడు అపస్మారక స్థితి లో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 8.40 గంటలకు అంబులెన్స్‌లో పై దవాఖానకు పంపించారని తెలిపారు. ఈ క్రమంలో రవిచందర్ తనకు 8.24 గంటలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిట్టాడని డాక్టర్ జగదీశ్వర్ లేఖలో వివరించారు. ఆడియోను సైతం కమిషనర్‌కు పంపారు.