హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయరంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడుల నేపథ్యంలో రైతులు దీర్ఘకాలిక ఆదాయాలనిచ్చే పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు కొత్త వంగడాలను అందుబాటులోకి తెస్తున్నారు. తక్కువ కాలంలోనే అధిక ఏండ్లపాటు ఆదాయాలనిచ్చే వెదురు మొక్క లో ్లకొత్తరకం విత్తనాలను అందుబాటులోకి తెచ్చారు.
ఈ కొత్తరకం వెదురు విత్తనాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఫ్రూట్స్(సీఈవో ములుగు)అధికారులు తెచ్చి రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు కొత్తరకం వెదురు మొక్కలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ములుగు సీఈవో శ్రీధర్ తెలిపారు. ఈ కొత ్తరకం విత్తనాలను త్రిపుర నుంచి తెప్పించామని పేర్కొన్నారు. ఆగస్టులో వీటిని పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.