శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకులించకపోవడంతో పలు విమానాలను విజయవాడ ఎయిర్పోర్టుకు మళ్లించనున్నట్టు జీఎంఆర్ ఎయిర్పోర్టు ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల ను విజయవాడ ఎయిర్పోర్టుకు తరలించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. కోల్కత,ముంబై, పుణె ఎయిర్పోర్టుల నుంచి వచ్చిన ఇండిగో విమానాలను దారి మళ్లించిన్నట్టు తెలిపారు.