G Devi Prasad | తెలంగాణలో మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం : జి దేవీప్రసాద్
G Devi Prasad | తెలంగాణ రిజర్వేషన్లను ( Reservations ) కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశముందని హెచ్చరించారు.
హైదరాబాద్ : తెలంగాణ రిజర్వేషన్లను ( Reservations ) కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ (G Devi Prasad )అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ముల్కీ ఉద్యమం (Mulki movement ) వచ్చే అవకాశముందని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత భుజంగ రావు , టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ , బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్ర చారితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ కొత్తకొత్త నిబంధనలు తీసుకు రావడం వల్ల తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 3 యేండ్లు తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ B tech చదివితే స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణలో బీటె క్పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారు మొత్తం స్థానికులుగానే భావించాల్సి వస్తుందని వెల్లడించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసు తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. తీర్పు ఇచ్చిన జడ్జిని తప్పు పట్టడం లేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన వాదనలు వినిపించడంలో విఫలం చెందడం వల్లే సమస్య వస్తుందని వివరించారు. సాంకేతక సమస్యలతో ఆదిలాబాద్ కొమరం భీం జిల్లా లాంటి ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగాలు పొందలేక పోయారని వెల్లడించారు. ఈ అంశాలను గమనించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ కృషి చేశారని , 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న వారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికులుగా గుర్తించడం లేదని పేర్కొన్నారు. స్థానిక అంశం తెలంగాణలో మళ్లీ అలజడులు జరిగేలా ఉందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన రీతిలో కౌంటర్ దాఖలు చేయలేదని, జీఏడీ అధికారులు, చీఫ్ సెక్రటరీ సమావేశం నిర్వహించి దీని పై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. లేకపోతే ముల్కీ రూల్ ఉద్యమం మళ్లీ వచ్చే అవకాశం ఉందని జోయం చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బీమా పథక సదుపాయం ఇప్పటికే ఉందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఎంతో ఆశతో ఎదురుచూశారని, సీఎం వారిని నిరాశపరిచారని తెలిపారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, సీపీఎస్ గురించి మాట్లాడనే లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా ఉంటుందా , కనుమరుగు అవుతుందో అనుమానం కలుగుతుందని బీఆర్ఎస్ నాయకుడు భుజంగ రావు తెలిపారు. నాడు కేసీఆర్ విద్యా అవకాశాలు మెరుగు పరురగా రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

