హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం దర్శించుకుని సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ముఖేశ్ అంబానీకి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కోసం ఒక ఆధునిక, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాల నిర్మించనున్నట్టు ముకేశ్ ప్రకటించారు. శ్రీవారి దివ్య ఆశీస్సులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి.. రూ.5 కోట్లను విరాళం ప్రకటించారు.