హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తన పేరు మార్చుకొనేందు కు రెడీ అవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తానని, అలా కాకపోతే తాను పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఫలితాల్లో పవన్‌కల్యాణ్ ఘన విజయం సాధించారు. దానికి కట్టుబడి తన పేరు ను పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్న ట్టు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ పత్రా లు రెడీ చేసుకున్నట్టు వెల్లడించారు.