నల్లబెల్లి, ఏప్రిల్ 24: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ముద్ర సంస్థ సిబ్బందిని ఖాతాదారులు ఆదివారం నిర్బంధించారు. బాధితుల కథనం మేరకు.. ముద్ర సంస్థ నల్లబెల్లి శాఖ వారు మండలంలో 150 మం దిని ఖాతాదారులుగా చేర్పించారు. ఒక్కొక్కరి నుంచి రోజువారీ, నెల వారీ పద్ధతుల్లో సుమారు రూ.45 లక్షలు కట్టించుకొన్నారు. కాలపరిమితి తీరాక అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తామని చెప్పారు. డబ్బులు ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయంలోని సామగ్రిని గుట్టుగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆదివారం ఖాతాదారులు వారిని గదిలో బంధించా రు. ఎస్సై హామీ మేరకు వారు తాళం తీశారు.