బొల్లారం, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత, హేతుబద్ధత పూర్తిగా లోపించాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఫలితంగా అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొందని మండిపడ్డారు. సోమవారం సికింద్రాబాద్ డ్రీమ్ల్యాండ్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’ పిలుపుతోనే వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదించిందని తెలిపారు.
ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు మాలలు మినహా 58 కులాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. మాదిగల జనాభాను పరిగణనలోకి తీసుకున్నా.. వెనుకబాటుతనం ఆధారంగా తీసుకున్నా 12% రిజర్వేషన్లు రావాలని స్పష్టంచేశారు. తప్పులు, లోపాలను సవరించి, ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్చేశారు.