హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్స్ ఇవ్వాలని, 317జీవోను వర్తింపజేయవద్దని ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంపీడీవోలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారందరికీ ఎలాంటి ఆంక్షలు విధించకుండా యధా స్థానాలకు బదిలీ చేయాలని కోరారు. తహసీల్దార్ల తిరుగు బదిలీల్లో అనుసరించినట్టుగానే ఎంపీడీవోలకు ఆప్షన్స్ ఇస్తామమని సీతక్క వారికి హామీ ఇచ్చారు.