హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్రబొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యుడిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.
ఈ సంఘానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఎంపీ రవిచంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.