హైదరాబాద్ : తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చనలో లేదా గిప్ట్ ఏ స్మైల్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం మీ బర్త్‌డేకు గొప్ప సత్కారం లాంటిది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నయ్యకు థ్యాంక్యూ చెబుతూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. కేటీఆర్ బర్త్‌డేను చిరస్మరణీయంగా ఉండేలా మార్చాలనుకుంటున్నామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.
Thank you annayya for the call! Participating any of these #GiftASmile & #MukkotiVruksharchana initiatives are fitting gestures on the occasion of your birthday. Would like to make this Special day of yours a memorable one👍😊.https://t.co/tZpVMbTUuh#GreenIndiaChallenge🌱. https://t.co/FfRsyFgiju
— Santosh Kumar J (@MPsantoshtrs) July 22, 2021