ఇచ్చోడ, అక్టోబర్ 27: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 20 వేల మొక్కలు నాటిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని ముక్రా (కే) గ్రామస్థులను ఎంపీ సంతోష్‌కుమార్ అభినందించారు. ఇప్పటికే 80 వేల మొక్కలు నాటి, సంరక్షించడంపై ప్రశంసలు కురిపించారు.
గ్రామస్థులు నాటిన మొక్కల ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముక్రా (కే) గ్రామస్థులు తన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గె మీనాక్షికి అభినందనలు తెలిపారు.