హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిపై పోరాడాలని టీఆర్ఎస్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎంపీ నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్నదని, రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై రాజ్యాంగ సవరణలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
ఈ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి బలపరుస్తూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘వన్ నేషన్ – వన్‌కార్డ్, వన్ ఎలక్షన్…’ విధానాలను ప్రవేశపెడుతున్నదని అన్నారు. ‘అవర్ నేషన్’ అనే భావన తీసుకురావాలన్నారు.