మేడ్చల్ మల్కాజిగిరి : రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై(Real estate broker) మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender)చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, రద్దయిన ఏకశిల వెంచర్లో రియల్ బ్రోకర్స్ అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల బ్రోకర్లపై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల
పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్ పై దాడి pic.twitter.com/BmU5J08YtX
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025