హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తేతెలంగాణ): పార్లమెంట్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్‌గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తురంగంలో పనిచేస్తున్న 19వేల మంది ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విద్యుత్తురంగ ఆర్టిజన్ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న విద్యుత్తురంగ ఆర్టిజన్ కార్మికులు గత 10 ఏండ్లుగా పదోన్నతులు లేకుండా, వేతనాలు పెరుగకుండా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. నిరంతరం విద్యుత్తు సరఫరాలో కీలకపాత్ర పోషిస్తూ ప్రాణాలు సైతం లెకచేయకుండా పనిచేస్తున్న ఆర్టిజన్స్ జీవితాలు ఇబ్బందులపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టిజన్స్ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నరాటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బానోతు శంకర్, వరింగ్ ప్రెసిడెంట్‌గా అల్లం ఓదేలు, డిప్యూటీ కార్యదర్శిగా బీ లక్ష్మయ్య, కార్యదర్శులుగా రాజునాయక్, కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.