చిక్కడపల్లి,జూన్12 : ప్రభుత్వ పోస్టుల పెంపుపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వనరుల రక్షణ సమితి నాయకుడు బక్క జడ్సన్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంధాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే లక్ష పోస్టులు భర్తీ చేస్తామని హామీలిచ్చి, అధికారం రాగానే వాటిని మార్చిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఖాళీలపై సమీక్షించలేదని మండిపడ్డారు. అన్ని శాఖల్లో కలిపి 3 లక్షల 70వేల 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటికి అనుకుగుణంగా పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు.