హార్టికల్చర్ వర్సిటీ, ‘క్యాబ్’ మధ్య ఎంవోయూ
శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కాబ్ ఇంటర్నేషనల్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. సోమవారం వర్సిటీ పరిపాలన భవనంలో రెండు సంస్థల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
- వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కాబ్ ఇంటర్నేషనల్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. సోమవారం వర్సిటీ పరిపాలన భవనంలో రెండు సంస్థల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉండటం వల్ల ఏ సమయంలోనైనా ఆయా కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని, ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని విద్యార్థులకు వీసీ సూచించారు.
ఈ అవగాహన ఒప్పందంతో రెండు పక్షాల మధ్య పలు అంశాల్లో అవగాహన మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చీడ, పీడల యాజమాన్యం, నేల సారవంతం, విత్తనాలు, బిజినెస్, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలపై ఆన్లైన్ కోర్సులు ఉన్నాయని క్యాబ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ టీం లీడర్ మాళవిక చౌదరి పేర్కొన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, పరిశోధన సంచాలకులు లక్ష్మీ నారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీనివాసన్, సీఏబీఐ సౌత్ ఆసియా అగ్రికల్చర్ డిజిటల్ టూల్స్ కో-ఆర్డినేటర్ మాధురి మంజరి, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సెల్ డైరెక్టర్ అనిత కుమారి, బోర్డు మెంబర్ ప్రశాంత్, కన్సల్టెంట్ వీరాంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

