Telangana | ఢిల్లీలో తెలంగాణ నిరుద్యోగుల దీక్షకు అనుమతి కోరిన మోతీలాల్ నాయక్
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లపై ఇప్పటికీ స్పందించలేదు. దీంతో నిరుద్యోగులు ఢిల్లీలో తమ నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ.. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం ఢిల్లీ డిప్యూటి కమిషనర్ పోలీసు ఆఫీసర్‌ను నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ కలిశారు.
Telangana | న్యూఢిల్లీ : తెలంగాణలోని నిరుద్యోగులంతా నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీతో పాటు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేశారు. వారం పది రోజుల క్రితం టీజీపీఎస్సీ ముట్టడికి కూడా యత్నించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లపై ఇప్పటికీ స్పందించలేదు. దీంతో నిరుద్యోగులు ఢిల్లీలో తమ నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ.. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం ఢిల్లీ డిప్యూటి కమిషనర్ పోలీసు ఆఫీసర్‌ను నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ కలిశారు. జంతర్ మంతర్ వద్ద ఈ నెల 16వ తేదీన తెలంగాణ నిరుద్యోగులు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇక రెండు రోజుల క్రితం అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము 3 గంటల వరకు తమ నిరసనను కొనసాగించారు. దీంతో నిన్న ఉదయం అశోక్‌నగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా చిక్కడపల్లి లైబ్రరీ లోపలనే వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ -2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా, డీఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి ఢిల్లీ డీసీపీని అనుమతి కోరిన మోతీలాల్ నాయక్ pic.twitter.com/B5CuB6MIoI
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
ఇవి కూడా చదవండి..
TGEAPCET | టీజీఎప్‌సెట్ ఫస్ట్ ఫేజ్.. వెబ్ ఆప్షన్ల నమోదుకు మరో రెండు రోజులు గడువు పొడిగింపు
Telangana | రీషెడ్యూల్ రుణాలకు రుణమాఫీ వర్తించదు.. కీలకమైన మార్గదర్శకాలివే..!
Telangana | పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం
KTR | మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుంది.. రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

