హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్‌తో గాంధీ భవన్‌ను ముట్టడించి అరెస్టయిన మోతీలాల్‌నాయక్ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 10 రోజులుగా ఆ యన జైలులో ఉన్నారు. విడుదల సందర్భంగా మోతీలాల్ మాట్లాడు తూ ‘నిరుద్యోగులను నిండా ముంచి న రేవంత్.. ఖబర్దార్.. నిన్ను చీకట్లో పెట్టే రోజులు వస్తయ్’ అని హెచ్చరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐఏఎస్‌లపై హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. బుధవారం నవీన్‌మిట్టల్, సోమేశ్‌కుమార్, అమోయ్‌కుమార్‌పై భూ బాధితులు ఈడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీపావళి తర్వాత ఆ ఐఏఎస్‌లను ఈడీ విచారించనున్నట్టు తెలిసింది.