హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం ఆయన చేస్తున్న దీక్షతో సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవాలని స్పష్టం చేశా రు.
వారం రోజులుగా దీక్షలో ఉన్న మోతీలాల్ ఆరోగ్య పరిస్థితి రోజురోజు కూ విషమిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పాటైన ఖాళీలను ఆ నోటిఫికేషన్లో కలిపి మెగా డీఎస్సీగా మార్చాలన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో భవిష్యత్తు పరిణామాల కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.