RS Praveen Kumar | అమ్మ రుణం కోటి జన్మలెత్తిన తీర్చలేనిది : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar | అమ్మతనం మాటాల్లో వర్ణించలేమని, అమ్మ ప్రేమ అక్షరాల్లో రాయలేమని మాజీ ఐపీయస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
కడ్తాల్ : ప్రపంచంలో అమ్మలేని గ్రామం, దేశం లేదని, సృష్టికి మూలం అమ్మ అని మాజీ ఐపీయస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ( RS Praveen Kumar ) , తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజిని సాయిచంద్ ( Rajini Saichand ) అన్నారు. ఆదివారం మాతృదినోత్సవాన్ని ( Mothers Day ) బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంబాల పరమేష్ అధ్యక్షతన , ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కడ్తాల్ పట్టణంలోని అంగన్వాడీ సబ్ సెంటర్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని గర్భిణులకు న్యూట్రీషన్ , మెడికల్ కిట్లను( Medical Kits ) తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తాతో కలిసి పంపీణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మతనం మాటాల్లో వర్ణించలేమని, అమ్మ ప్రేమ అక్షరాల్లో రాయలేమని అన్నారు. ఈ సృష్టిలో తియ్యని పదం అమ్మ . వెలకట్టలేనిది అమ్మ ప్రేమ అని పేర్కొన్నారు. అమ్మ చూపే అప్యాయతలో ఇంకేవారు సాటిరారన్నారు. జీవన ప్రయాణంలో అనునిత్యం దీవిస్తూ ప్రేమించే మా అమ్మ అని వర్ణించారు.
ప్రస్తుత తరుణంలో యువత చెడు ఆలవాట్లకు బానిసై అమ్మతనాన్ని మరిచి కొంతపుంతలు తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఆ దైవమే రక్షించాలని అన్నారు. భారతదేశం సంస్కృతీ సాంప్రదాయలకు నిలయమని, మాతృమూర్తి గొప్పతనం ఆనాడే సమాజానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 240 గర్భిణులకు మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సతీమణి మంజుల, కుమారుడు , కోడలు అనిల్, భావన, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, విజితారెడ్డి, సీనియర్ నాయకులు చంద్రమౌళి, లచ్చిరాం, నర్సింహ్మ, సాయిలు, లక్షీనర్సింహ్మ రెడ్డి, జ్యోతయ్య, గోపాల్, గంప వెంకటేష్, శంకర్, కొమ్ము శ్రీనివాస్, గోపాల్, సురేష్, శ్రీకాంత్, గణేష్, మహేష్, రంగయ్య, రమేష్, సాయిలు, జంగయ్య, రామకృష్ణ, యాదయ్య, రమేష్, మహేష్, లాయక్ అలీ, రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

