మాతృమూర్తుల దినోత్సవం(మదర్స్ డే) సందర్భంగా ఆదివారం రామగుండంలోని గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 2022 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఈ కార్యక్రమంలో 2022 మంది మాతృమూర్తులకు పాదపూజ చేశారు. ఆ తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులంతా తమ కుమార్తెలు, కొడుకులను ఆశీర్వదించారు. స్టేడియమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన మాతృమూర్తి సర్గీయ కోరుకంటి విజయమ్మ గారికి నివాళులు అర్పించారు. ఆ తరువాత రామగుండం ప్రజనీకం అంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ సర్వమాత ప్రార్థనలు చేపట్టారు. పాదపూజ మహోత్సవ 2022 సి.డి ని ఎమ్మెల్యే కోరుకంటి అవిష్కరించారు.