Vikarabad | ఓ యువకుడు జల్సాల కోసం భారీగా అప్పులు చేశాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించలేక తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలంలో దసరా పండుగ రోజున చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బషీరాబాద్ మండలం కాశీపూర్‌లో అంజమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు వెంకటేశ్ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో భారీగా అప్పులు చేశాడు. అప్పులు తిరిగి చెల్లించలేక, తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన వెంకటేశ్ తన తల్లి అంజమ్మను హత్య చేశారు. అనంతరం తల్లి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి స్థానికంగా ఉన్న వాగులో పడేశాడు. ఈ కేసులో కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.